Monday, February 16, 2026
Homeక్రైమ్ వార్తలుAlert | ఈ లింకులు క్లిక్ చేస్తున్నారా..?

Alert | ఈ లింకులు క్లిక్ చేస్తున్నారా..?

  • యువతే టార్గెట్..
  • క్లిక్ చేస్తే అంతే సంగతులు..

వాలెంటైన్స్‌డే సందర్భంగా ప్రేమికులను లక్ష్యంగా చేసుకుంటున్న సైబర్‌ క్రిమినల్స్‌ ఆన్‌లైన్‌ మోసాలకు పాల్పడుతున్నారని, యువత అప్రమత్తంగా ఉండాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా, డేటింగ్‌ యాప్‌లలో ప్రేమికులకు సంబంధించి, వాలెంటైన్స్‌ డే గురించి వివిధ రకాల ఆకర్షనీయమైన ప్రకటనలు ఇస్తుండడంతో, వాటికి ఆకర్షితులైన యువత లింకులు క్లిక్‌ చేసి మోసపోవద్దని అన్నారు..

పొరపాటున లింక్‌లను క్లిక్‌ చేస్తే సైబర్‌ క్రిమినల్స్‌ ఫోన్‌ను హ్యాక్‌ చేసి ఖాతాలను ఖాళీ చేస్తారని హెచ్చరించారు. అంతేకాకుండా లవర్స్‌ లేని వారు ఆన్‌లైన్‌లో కబుర్లు చెప్పుకోవచ్చంటూ వలపు వల విసిరి న్యూడ్‌ వీడియో కాల్స్‌తో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడతారని హెచ్చరించారు. ఇలాంటి సైబర్‌ మోసాలపట్ల, గుర్తుతెలియని వ్యక్తులు పంపే మోసపూరిత లింకులపట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు కోరారు

- Advertisement -
RELATED ARTICLES

Latest News