తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలంలోని బీరవెల్లి గ్రామంలో సోమవారం, సైబర్ నేరాలపై బ్యాంకు అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సంచార వాహనం ఏర్పాటు చేసి, నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాలు, సైబర్ నేరాలపై అప్రమత్తత, బ్యాంకింగ్ వ్యవస్థతో ముడిపడి ఉన్న వివిధ రకాల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

పలువురు అధికారులు మాట్లాడుతూ, ప్రజలంతా సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ గోపాల్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు ప్రాంతీయ మేనేజర్ నవీన్ కుమార్, గ్రామ సర్పంచ్ ఓబమ్మ, స్థానిక ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
