Homeనల్లగొండDefection | సిపిఎం పార్టీకి రాజీనామా బిఆర్ఎస్ లో చేరిక

Defection | సిపిఎం పార్టీకి రాజీనామా బిఆర్ఎస్ లో చేరిక

సిపిఎం పార్టీ యువజన సంఘం నుండి శనివారం నాడు మాజీ డిసిసిబి అధ్యక్షుడు గొంగిడి మహేందర్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరిన మంగ అరవింద్.

ఈ సందర్భంగా గొంగిడి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఆలేరు మున్సిపల్ ఎన్నికలలో 12 వార్డులలో బిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించడంలో కీలకమైన పాత్ర పోషించాలని వారు సూచించారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధి మాత్రం జరగడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

- Advertisement -
Manga Arvind Joins BRS Party in Alair0

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అక్రమ సంపాదనతో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధానాలు అవలంబిస్తున్నారని అందుకు ఉదాహరణగా అభ్యర్థులను కొనుగోలు చేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు.

Manga Arvind Joins BRS Party in Alair1

బిఆర్ఎస్ లో చేరిన డివైఎఫ్ఐ మాజీ డివిజన్ కార్యదర్శి మంగ అరవింద్, సిపిఎం నాయకులు మంగ మౌనిక, మొగిలి పాక కృష్ణ,పర్రె దయాకర్, గంధ మల్ల శోభన్ బాబు, యువజన సంఘం నాయకులు శ్రావణ్,ఉదయ్,కార్తీక్, వంశీ, భరత్,నాని,భాను,బాబు, చింటూ, చరణ్,శివ,భరత్,వికాస్ లతోపాటు మరో వంద మంది బిఆర్ఎస్ చేరారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు పుట్ట మల్లేష్, నాయకులు కొలుపుల హరినాథ్, మాజీ మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య, బేతి రాములు, 7 వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బింగి లత రవి, ఎనిమిదవ వార్డు అభ్యర్థి పాశికంటి శ్రీనివాస్, నాలుగో వార్డ్ అభ్యర్థి బీజని కళ్యాణి మధు మూడో వార్డు అభ్యర్థి యాట శివ రెండో వార్డ్ అభ్యర్థి మోతే కనకమ్మ వెంకటేష్, బిఆర్ఎస్ నాయకులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News