- కాంపల్లి శ్రీనివాస్
కాంగ్రెస్–సిపిఐ అవగాహనలో భాగంగా రానున్న జిహెచ్ఎంసి ఎన్నికల్లో అడ్డగుట్ట డివిజన్‌ను సిపిఐకి కేటాయించాలని సిపిఐ సికింద్రాబాద్ కార్యదర్శి కాంపల్లి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేశారు.అడ్డగుట్ట సిపిఐ కార్యాలయం శ్రామిక భవన్‌లో గౌరీ నాగరాజ్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,కమ్యూనిస్టుల రాజీలేని పోరాటంతోనే అడ్డగుట్ట ఏర్పాటైందని,సమస్యలపై సిపిఐకి సంపూర్ణ అవగాహన ఉందని తెలిపారు.అడ్డగుట్ట సమస్యల పరిష్కారం,పార్టీ బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళ్తామని,కార్యకర్తలు పూర్తిస్థాయిలో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాకాల యాదగిరి,సింగారయ్య,వెంకటేష్,అంజి,యాదగిరి,దస్తగిరి,కొండల్,రఫిక్,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
