ఇటీవల నూతనంగా ఎన్నికైన తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) కమిటీ మెంబర్స్ మెగాస్టార్ చిరంజీవి(Mega Star Chiranjeevi)ని మర్యాదపూర్వకంగా కలిశారు. అసోసియేషన్ అందిస్తున్న హెల్త్ ఇన్సూరెన్స్(Health Insurance), యాక్సిడెంటల్ పాలసీ(Accidental Policy)ల గురించి ఆయనకు తెలిపారు. దీంతోపాటు పలు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని మెగాస్టార్‌కి వివరించారు. భవిష్యత్తులో హౌసింగ్ సొసైటీ(Housing Society), క్లబ్ హౌస్ (Club House) వంటివి ఏర్పాటుచేయడానికి ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుత సంక్షేమ కార్యక్రమాలను కొనసాగించడంతోపాటు సభ్యుల ఉన్నతికి కృషి చేస్తామని వివరించారు. సినిమా జర్నలిస్టుల సంక్షేమం కోసం టీఎఫ్‌జేఏ చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను చిరంజీవి ప్రశంసించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్‌కి ఎప్పుడూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. మెగాస్టార్‌ను కలిసినవారిలో టీఎఫ్‌జేఏ అధ్యక్షుడు వైజే రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, కోశాధికారి సురేంద్ర కుమార్ నాయుడు, ఇతర కమిటీ మెంబర్స్ ఉన్నారు.
