జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla)గా గెలిచిన నవీన్ యాదవ్(Naveen Yadav).. ఐటీ & పరిశ్రమల శాఖ మంత్రి (Minister of IT & Industries) దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu)ను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకి మంత్రి అభినందనలు (Congratulations) తెలిపారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్ మాట్లాడతూ.. మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వం రాష్ట్ర ఐటీ రంగాన్ని నూతన శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి ఆయన సూచనల మేరకు కృషి చేస్తానని చెప్పారు.
