Thursday, March 26, 2026
Homeరంగారెడ్డిKothapet | అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ పవన్ కుమార్

Kothapet | అభివృద్ధి పనులను ప్రారంభించిన కార్పొరేటర్ పవన్ కుమార్

కొత్తపేట డివిజన్ పరిధిలో రూ.1.95 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ నాయి కటి పవన్ కుమార్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమర్షియల్ ట్యాక్స్ కాలనీ నుండి ఎస్బిహెచ్ కాలనీ, మోహన్ నగర్ పోచమ్మ దేవాలయం మీదుగా మోహన్ నగర్ చౌరస్తా వరకు బీటీ రోడ్డు నిర్మాణ పనులను,మారుతీ నగర్ జైన్ మందిర్ ఎదురుగా ఉన్న రోడ్ నెంబర్ 10 నుండి శ్వేత గార్డెన్ సమీపం వరకు సీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.

కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్‌లో పెండింగ్‌లో ఉన్న పనులు మరియు యువ చైతన్య యూత్ అసోసియేషన్‌కు సంబంధించిన పెండింగ్ పనులను త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన అన్నారు. శ్రీ శంకర్ కాలనీ రోడ్ నెంబర్ 4 నుండి 5 వరకు నూతన సివరేజ్ పైప్ లైన్ పనులను ప్రారంభించామని, ఇదే కాలనీ కమ్యూనిటీ హాల్ 29 లక్షల రూపాయలతో పునర్నిర్మాణం చేసి ప్రారంభించామని తెలిపారు.

- Advertisement -

ఈ అభివృద్ధి పనులు పూర్తయిన అనంతరం పలు కాలనీల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు మరియు మౌలిక వసతులు అందుబాటులోకి వస్తాయని కార్పొరేటర్ పవన్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కమర్షియల్ టాక్స్ కాలనీ అసోసియేషన్ సభ్యులు అంజయ్య, రాములు, విశ్వేశ్వరయ్య మరియు కమిటీ సభ్యులు మరియు శ్రీ శంకర్ కాలనీ సభ్యులు కృష్ణ, సెక్రటరీ రమేష్ చారి, ఆర్.లక్ష్మీ నారాయణ, విద్యా సాగర్, నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News