Friday, October 3, 2025
ePaper
HomeతెలంగాణContract nurses | జీతాలు లేక కష్టాలు పడుతున్న కాంట్రాక్ట్ నర్సులు

Contract nurses | జీతాలు లేక కష్టాలు పడుతున్న కాంట్రాక్ట్ నర్సులు

హైదరాబాద్: గత ఐదు నెలలుగా జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న సుమారు 160 మంది సీనియర్ కాంట్రాక్ట్ నర్సింగ్ సిబ్బంది(contract nurses) మంగళవారం డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME) కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కరోనా సమయంలో కాంట్రాక్ట్ పద్ధతిలో నియమితులైన వీరు, పెండింగ్‌లో ఉన్న తమ జీతాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

జీతాలు రాక అప్పుల పాలయ్యామని, వడ్డీతో సహా అప్పులు చెల్లించాలని ప్రైవేట్ వ్యక్తులు ఒత్తిడి చేస్తున్నారని ఓ నర్సు వాపోయారు. “జీతాలు రాక ప్రైవేట్ గా అప్పులు తీసుకున్నాం. ఇప్పుడు అప్పు ఇచ్చిన వాళ్లు వడ్డీతో సహా మొత్తం చెల్లించాలని అడుగుతున్నారు. మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది,” అని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి చెందిన కాంట్రాక్ట్ నర్సు సుధా ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి నెలకు సగటున రూ. 23,000 జీతం ఉంటుందని, ఐదు నెలలుగా జీతాలు అందకపోతే వారి కుటుంబాలు ఎలా గడుస్తాయని AITUC రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఎం. నరసింహ ప్రశ్నించారు. పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

కరోనా తర్వాత ఈ కాంట్రాక్ట్ నర్సులను(contract nurses) నిలోఫర్ ఆసుపత్రి, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి, ఈఎన్‌టీ ఆసుపత్రి, కోఠి మెటర్నిటీ ఆసుపత్రి, ఉస్మానియా జనరల్ ఆసుపత్రులకు బదిలీ చేశారు.

తాము మార్చి వరకు TIMS ద్వారా జీతాలు అందుకున్నామని, ఏప్రిల్ నుంచి DME కార్యాలయం నుంచి రావాల్సిన జీతాలు ఇంకా రాలేదని నర్సులు వాపోయారు. ఆరోగ్య శాఖ అధికారులు కావాలనే తమ జీతాలను ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు. సమస్య పరిష్కారం కాకపోతే సమ్మెకు దిగుతామని వారు హెచ్చరించారు.

మరిన్ని వార్తలు :

కాచిగూడలో గంజాయి పట్టివేత

RELATED ARTICLES
- Advertisment -

Latest News