కీసర : దమ్మాయిగూడ మున్సిపాలిటీలో ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్న నాసిన్ చెరువు కట్ట మట్టిరోడ్డు ఎట్టకేలకు పునరుద్ధరణకు నోచుకుంది. గురువారం 40లక్షల రూపాయల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు పనులను కమిషనర్ వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఇది బండ్లగూడ నుండి దమ్మాయిగూడకు వెళ్లే ప్రధాన రోడ్డు కావడంతో వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
