Monday, February 9, 2026
Homeఆదిలాబాద్MP | 10వ వార్డులో కాంగ్రెస్ విజయం దిశగా ప్రజల అడుగులు

MP | 10వ వార్డులో కాంగ్రెస్ విజయం దిశగా ప్రజల అడుగులు

  • పనస రాజయ్య భారీ మెజారిటీతో గెలుపు ఖాయం: MP గడ్డం వంశీకృష్ణ

క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పనస రాజయ్య భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువనేత, క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల TPCC ఇంచార్జీ గౌరవనీయులు గడ్డం వంశీకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి విశేషమైన మద్దతు లభిస్తున్నదని తెలిపారు. పనస రాజయ్య ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడని, వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు.

- Advertisement -

అభివృద్ధిపై స్పష్టమైన హామీలు

ఈ సందర్భంగా వంశీకృష్ణ ప్రజలకు పలు అభివృద్ధి హామీలు ఇచ్చారు.

  • తాగునీటి సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని
  • డ్రైనేజీ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని
  • రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని
  • పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు.

అలాగే, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతామని, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తామని వెల్లడించారు.

కాంగ్రెస్ సంక్షేమ పథకాలపై విశ్వాసం

కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాయని ఆయన పేర్కొన్నారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు పేద కుటుంబాలకు మేలు చేశాయని, అర్హులైన వారికి రేషన్ కార్డులు అందుతున్నాయని, సన్నబియ్యం పంపిణీ ప్రజలకు లాభం చేకూర్చిందని తెలిపారు.

ఈ అన్ని అంశాలు కాంగ్రెస్ పార్టీ విజయానికి బలంగా మారుతున్నాయని స్పష్టం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News