Tuesday, March 3, 2026
Homeవరంగల్‌Protest | పేరు తొలగించడం పట్ల కాంగ్రెస్ నిరసన.

Protest | పేరు తొలగించడం పట్ల కాంగ్రెస్ నిరసన.

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కేంద్రంలో పాత పద్ధతిలోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు పిన్నింటి అనిల్ రావు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి ధర్నాలో పాల్గొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయక్, అనిల్ రావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని కేంద్ర ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వలసలను అరికట్టి, పేదరికం తగ్గించి, పేదలకు స్థానికంగానే ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ నాయకత్వంలో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినట్టు తెలిపారు.

కానీ బీజేపీ ప్రభుత్వం ఈ పథకం పేరులో నుంచి ‘మహాత్మా గాంధీ’ పేరును తొలగించి, చరిత్రను చెరిపివేయాలని చూస్తోందని మండిపడ్డారు. గతంలో కేంద్రమే పూర్తి భారాన్ని మోసేదని, ఇప్పుడు 60:40 నిష్పత్తితో రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతున్నారని, పాత పద్ధతిలోనే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి గ్రామ సర్పంచ్ చీదురు శంకర్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు కూసం రాంచందర్, కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్‌లు, ఉప సర్పంచులు, వార్డ్ సభ్యులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అధ్య‌క్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News