Wednesday, February 11, 2026
HomeతెలంగాణMeenakshi Natarajan | మీ వల్లే ఓడిపోయాం..

Meenakshi Natarajan | మీ వల్లే ఓడిపోయాం..

  • పంచాయతీ ఎన్నికలపై కాంగ్రెస్‌ పోస్ట్‌మార్టమ్‌
  • 16 మంది ఎమ్మెల్యేల పనితీరుపై ఆగ్రహం
  • పంచాయతీ ఎన్నికలపై సీఎం రేవంత్‌తో కలసి సమీక్ష
  • రెబల్స్‌తో గణనీయంగా తగ్గిన ఫలితాల శాతం
  • పలువురికి ఫోన్లో తలంటేసిన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి
  • జిల్లాల వారీగా నివేదికలు తెప్పించుకోవాలని సూచన

పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం టెలీకాన్ఫరెన్స్‌ నిర్వహించింది. సీఎం రేవంత్‌రెడ్డి, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌, కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికల ఫలితాలపై చర్చించారు. ఇటీవలి ఫలితాలపై పోస్ట్‌మార్టమ్‌ నిర్వహించారు. రెబల్స్‌ను సమన్వయం చేయలేని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులపై రేవంత్‌రెడ్డి, మహేశ ్‌కుమార్‌ గౌడ్‌ అసహనం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో సరిగా పనిచేయని 16 మంది ఎమ్మెల్యేలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా నల్లగొండలో ఎమ్మెల్యేల్లో సమన్వయ లోపం కనిపించిందని భావించారు. రెబల్స్‌తో సమన్వయ లోపం, బంధువులను అభ్యర్థులుగా నిలబెట్ట డాన్ని తప్పుబట్టారు.

పార్టీకి తీరని నష్టం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకుని పార్టీ నియమ నిబంధనలకు లోబడి పనిచేయాలని ఆదేశించారు. తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56 శాతం స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. 31 జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచి పదవులకు మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్‌ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో భారాస గెలుపొందింది. భాజపా 688 స్థానాలు పొందగా… ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. అయితే తమకు పట్టున్న కొన్ని చోట్ల స్థానాలను కోల్పోవడంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా ఉంది. ఈక్రమంలోనే దానికి బాధ్యులైన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ బాధ్యులతో సమావేశం నిర్వహించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News