Thursday, February 12, 2026
Homeహైదరాబాద్‌Congress Party | జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ దూకుడు

Congress Party | జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ దూకుడు

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (JubileeHills Bye Elections) ప్రచారంలో అధికార కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. నవీన్ యాదవ్(Naveen Yadav)కు మద్దతుగా నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. బోరబండ(Borabanda)లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌(Corner Meeting)లో నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. తనకు ఒకసారి అవకాశం ఇస్తే ఈ ప్రాంత ప్రజలను కడుపులో పెట్టుకొని చూసుకుంటానని చెప్పారు.

టిఫిన్ (Tiffin) డబ్బాలకు.. వాటర్ బాటిల్స్ (Water Bottles) రాజకీయాలకు మోసపోవొద్దని కోరారు. మీ అన్నగా.. మీ తమ్ముడిగా.. మీ బిడ్డగా..మీ కష్టం తెలిసినోడిని నేను.. ఒకసారి అలోచించి సరైన నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తు(Hand Symbol)కు ఓటు వేసి నియోజకవర్గం అభివృద్ధిలో భాగ్యస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున్న పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News