Tuesday, February 10, 2026
Homeఆంధ్రప్రదేశ్Congress Party | బండ్లపల్లి నుంచే దేశవ్యాప్త నిరసన

Congress Party | బండ్లపల్లి నుంచే దేశవ్యాప్త నిరసన

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం(Mahatma Gandhi National Rural Employment Guarantee Act-MGNREGA) పేరు మార్చటాన్ని కాంగ్రెస్ పార్టీ (Congress Party) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై దేశవ్యాప్తంగా నిరసన తెలపాలని నిర్ణయించింది. ఇందుకు చారిత్రక నేపథ్యమున్న ప్రాంతాన్ని ఎంపిక చేసింది. ఈ పథకాన్ని 2006 ఫిబ్రవరి 2న అప్పటి యూపీఏ ప్రభుత్వం(UPA Government) ఏపీ(AndhraPradesh)లోని అనంతపురం జిల్లా(Ananthapur District) బండ్లపల్లి(Bandlapalli)లో ప్రారంభించింది. అందువల్ల అక్కడి నుంచే ఈ నిరసనకు శ్రీకారం చుట్టబోతోంది. అక్కడ జరిగే ఈ ఆందోళనలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతోపాటు సీనియర్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తదితరులు పాల్గొంటారు. ఈ మేరకు ఆ గ్రామంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పథకం పేరును ప్రస్తుత బీజేపీ సర్కారు విక్‌సిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్(వీబీజీరామ్‌జీ-VBGRAMG)గా మార్చిన సంగతి తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES

Latest News