- వార్డు సభ్యులను గెలిపించిన ఓటర్లకు ధన్యవాధాలు.
- మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జాటోత్ శ్రీనివాస్ నాయక్.
గతంలో పాలించిన నాయకులు, గత ప్రభుత్వాలు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం ఏనాడు పట్టించుకోలేదని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాటోత్ శ్రీనివాస్ నాయక్ అన్నారు. శుక్రవారం పర్వతగిరి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచులు, వార్డ్ నెంబర్లు గెలుపు కోసం కృషి చేసిన కాంగ్రెస్ జిల్లా నాయకులకు, మండల కమిటీ ముఖ్య నాయకులకు, అనుబంధ సంఘాల అధ్యక్షులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, బూత్ కన్వీనర్లకు, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు, వివిధ హోదాలో పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేశారు.
ప్రజా ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు చేస్తున్నా అభివృద్ధిని ప్రజలకు వివరించి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషిచేసిన నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో వస్తున్న సంక్షేమ పథకాలు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, సన్న బియ్యం, రైతు రుణమాఫీ, బోనస్, రైతు భరోసా ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని పర్వతగిరి మండల ఓటర్ మహాశయులు ఆశీర్వధించి గెలిపించినందుకు మండల ప్రజలకు మండల కాంగ్రెస్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నిక ఎప్పుడు వచ్చినా అది కాంగ్రెస్ పార్టీ విజయం అని, ప్రజా ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందే విధంగా నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచ్లు, వార్డ్ మెంబర్లు గ్రామ అభివృద్ధి కోసం పని చేస్తారని శ్రీనివాస్ నాయక్ తెలిపారు.
