- 6గ్యారంటీలను గాలికి వదిలేసి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ
- ఆగ్రహం వ్యక్తం చేసిన బిజెపి నాయకులు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు మనోహరాబాద్ మండల అధ్యక్షులు బక్క వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో బుధవారం తహశీల్దార్ ను తన కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేసిన మండల బిజెపి నాయకులు.ఈ సందర్భంగా బిజేపీ రాష్ట్ర నాయకులు నత్తి మల్లేష్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరిస్తుందని రాష్ట్రంలో అర్హులైన నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వడం లేదని ఆరోపించారు.
వికలాంగులకు,వితంతువులకు,వృద్ధులకు నూతన పింఛన్లు మంజూరు చేయడం లేదని,ఎన్నికల సమయంలో అనేక ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతు పెట్టుబడి సాయం ఎకరాకు 6000 రుపాయలు వేస్తామని చెప్పి మూడు విడతల పైసలు ఎగ్గొట్టి రైతులను మోసం చేస్తోందని ఆయన అన్నారు
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు అనేక హామీలు ఇవ్వడం జరిగందనారు. కానీ వాటిలో ఏ ఒకక హామీ కూడా ఇప్పటివరకు పూరిిగా అమలు కాలేదు. ముఖ్యంగా యువతకు జాబ్ కాాలండర్, నిరుద్యాగ భృతి, వృద్ధాప్య , వితంతు మరియు దివ్యాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి, పేదలకు గృహ నిర్యాణ పథకం, రైతులకు రైతు భరోసా, భూ సమసాల పరిష్కకరం వంటి అనేక హామీలు ఇప్పటికే అమలు కావడం లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని ఓటు వేసిన ప్రజలు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుతవంపై తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు అని.మండలంలో రైతులు తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నారు అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు. రైతు భరోసా సమయానికి అందకపోవ్డంతో రైతులు పెట్టుబ్డుల కోసం అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏరపడుతోంది అని తెలిపారు.
అలాగే వృద్ధాప్య వితంతు మరియు దివ్యాంగులకు ప్రభుత్వం అందించే ఆసరా పెన్షన్లు అర్హులైన లబ్ధిదారులకు అందడం లేదు మండలంలో దరఖాస్తు చేసుకున్న అనేకమంది వృద్దులు వికలాంగులు మరియు ఒంటరి మహిళలకు ఇప్పటికి పెన్షన్లు మంజూరు కాలేదు అర్హులైన అభ్యర్థుల అందరి దరఖాస్తులను వెంటనే ఆమోదించి వారికి పెన్షన్లు అందించాలని కోరారు, పేదలకు ప్రభుత్వం ప్రకటించిన గృహ నిర్మాణ పథకం కింద అర్హులైన లబ్ధిదారులకు వెంటనే ఇల్లు మంజూరు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదని ఆ సమస్యల పరిష్కారం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కిరణ్ కుమార్, కాళ్లకల్ గ్రామ అధ్యక్షులు కొత్తూరి మల్లేష్ ముదిరాజ్, మండల నాయకులు ఎర్ర కృష్ణ, బూత్ కమిటీ అధ్యక్షులు చెట్టి రాజు ముదిరాజ్,ఎర్ర శేఖర్, సోషల్ మీడియా కన్వీనర్ మంచి గిరీష్ తదితరులు పాల్గొన్నారు .
