Saturday, October 4, 2025
ePaper
Homeతెలంగాణనిరుద్యోగలను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్

నిరుద్యోగలను నమ్మించి గొంతు కోసిన కాంగ్రెస్

చిక్కడపల్లి లైబ్రరీ లో జాబ్ క్యాలెండర్, నోటిఫికేషన్ లు వెంటనే విడుదల చేయాలని మంగ‌ళ‌వారం నిరుద్యోగులు ప్ల‌కార్డుల‌తో నిరసన వ్యక్తం చేశారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. నిండు అసెంబ్లీ సాక్షిగా జాబ్ క్యాలెండర్ ఇస్తామన్న ఉప ముఖ్యమంత్రి భ‌ట్టి విక్రమార్క వెల్ల‌డించారు. కానీ నేటికి జాబ్ క్యాలెండ‌ర్ ప్ర‌క‌టించ‌కుండా ఎందుకు మౌనం వ‌హిస్తున్నారో అర్థం కావ‌డం లేదంటూ మండిప‌డ్డారు. నోటిఫికేషన్స్ వద్దు అని నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు అని ముఖ్య మంత్రి ప్రకటనలు చేయ‌డం హాస్యాస‌ప‌దమ‌న్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్య మంత్రి, మంత్రులు అందరూ నోరు తెరిస్తే ప‌చ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. నిరుద్యోగుల పై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News