Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Compensation | రూ.23.50 కోట్ల పరిహారం మంజూరు

Compensation | రూ.23.50 కోట్ల పరిహారం మంజూరు

నారాయణపూర్ జలాశయ, కెనాల్ ముంపు భూముల బాధితుల కోసం

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక కృషి

- Advertisement -

కరీంనగర్, నవంబర్ 15 (ఆదాబ్ హైదరాబాద్): శ్రీపాదసాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు (Yellampally Project) స్టేజ్-2లో భాగంగా గంగాధర మండలం నారాయణపూర్ జలాశయం, కెనాల్ (Canal) ముంపు భూముల రైతులకు (Farmers) ప్రభుత్వం పరిహారం విడుదల చేసింది. రూ.23 కోట్ల 50 లక్షల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీపాద సాగర్ ఎల్లంపల్లి ప్రాజెక్టు స్టేజ్-2 ద్వారా నారాయణపూర్, స్తంభంపల్లి చెరువుల విస్తరణ, నారాయణపూర్ నుంచి వేములవాడ, స్తంభంపల్లి చెరువులకు గ్రావిటీ కెనాల్ నిర్మాణం కోసం భూములను (Lands) సేకరించారు. చొప్పదండి ఎమ్మెల్యే (Choppadandi Mla) మేడిపల్లి సత్యం (Medipalli Sathyam) ప్రత్యేక కృషితో పరిహారం చెల్లింపునకు ప్రభుత్వానికి విన్నవించడంతో ఈ నిధులు మంజూరయ్యాయి. భూములు కోల్పోయినవారికి పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం ఈ నిధులను మంజూరుచేసింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News