తెలంగాణ డిజిపిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శివధర్‌రెడ్డి(ShivadharReddy) తొలిసారి నగరంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ICCC)ను సందర్శించారు. భవనంలోని పలు అంతస్తుల్లో ఉన్న ఆఫీసులను చూశారు. 4వ అంతస్తులోని డేటా సెంటర్(Data Center), ఇతర అధికారుల ఛాంబర్లు (Chambers), 8వ అంతస్తులోని స్టేట్ కాన్ఫరెన్స్ హాల్(State Conference Hall), 18వ అంతస్తులోని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం(Hyderabad Police Commissioner), 19వ అంతస్తులోని హెలిప్యాడ్(Helipad) తదితరాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి.సజ్జనార్, కమాండ్ కంట్రోల్ సెంటర్ డైరెక్టర్ వి.బి.కమలాసన్ రెడ్డి, డీసీపీలు పుష్ప, కె.అపూర్వరావు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
