Wednesday, March 4, 2026
Homeకరీంనగర్Pamela Satpati | విద్యార్థినికి కలెక్టర్ అభినందన

Pamela Satpati | విద్యార్థినికి కలెక్టర్ అభినందన

కరీంనగర్, నవంబర్ 12 (ఆదాబ్ హైదరాబాద్): ఇటీవల తెలంగాణ ఆర్చరీ అసోసియేషన్ (Telangana Archery Association) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ (State level sub-junior) అండర్-18 బాలబాలికల పోటీల్లో స్థానిక పద్మానగర్ పారమిత హెరిటేజ్ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని తాడూరి హరిణి రెడ్డి అత్యుత్తమ ప్రతిభను కనబరిచి కాంస్య పతకం సాధించి జాతీయ స్థాయి పోటీలకు (national level competitions) ఎంపికయ్యారని పాఠశాల డైరెకర్ హన్మంతరావు తెలిపారు.

ఈ నెల 25 నుంచి 30 వరకు అరుణాచల్‌ప్రదేశ్‌(Arunachalpradesh)లోని ఇటానగర్‌(Itanagar)లో జరిగే 24వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ ఆర్చరీ బాలబాలికల అండర్-18 ఛాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది. జాతీయ స్థాయికి ఎంపికైన విద్యార్థినిని కలెక్టర్ పమేలా సత్పత్తి.. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వి.యు.యం.ప్రసాద్, వినోద్ రావు, హన్మంతరావు, ప్రధానోపాధ్యాయుడు గోపీకృష్ణ, సమన్వయకర్త రబీంద్ర పాత్రో, వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.రాజు, రాజబాపు, శ్రీనాథ్, గోలి సుధాకర్ అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News