Tuesday, February 10, 2026
Homeకరీంనగర్Pamela Satpathy | రూల్స్ ప్రకారమే నామినేషన్లు

Pamela Satpathy | రూల్స్ ప్రకారమే నామినేషన్లు

అభ్యర్థుల సందేహాలను హెల్ప్ డెస్క్‌లో నివృత్తి చేయాలి
కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ నామినేషన్ కేంద్రాల పరిశీలన

ఎన్నికల కమిషన్(Election Commission) నియమ నిబంధనలను(rules and regulations) తూచా తప్పకుండా పాటిస్తూ నామినేషన్ల(Nominations) ప్రక్రియను పూర్తిచేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్(Karimnagar District Collector) పమేలా సత్పతి(Pamela Satpathy) ఎన్నికల అధికారులను ఆదేశించారు. మునిసిపల్ ఎన్నికల(Municipal Elections) ప్రక్రియలో భాగంగా కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఏర్పాటుచేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి మునిసిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయితో కలిసి పరిశీలించారు(Inspection). కార్యాలయంలో ఏర్పాటుచేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాల్లో సదుపాయాలను పరిశీలించారు. నామినేషన్ పత్రాల స్వీకరణకు సంబంధించి పలు సూచనలు చేశారు.

- Advertisement -

హెల్ప్ డెస్క్, పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు. సపోర్టింగ్ స్టాఫ్ వివరాలను ఆరా తీశారు. పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలని, నామినేషన్లను తీసుకున్నవారి వివరాలను నమోదుచేయాలని సూచించారు. డివిజన్లవారీగా దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించి టీ పోల్ యాప్‌లో అప్‌లోడ్ చేయాలని ఆదేశించారు. మునిసిపల్ ఎన్నికల్లో పొరపాట్లు లేకుండా పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఎన్నికల సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలని మునిసిపల్ కమిషనర్‌ను ఆదేశించారు.

కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన

కరీంనగర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆఫీసులో ఏర్పాటుచేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. నామినేషన్ కేంద్రాలు, హెల్ప్ డెస్క్, మునిసిపల్ ఆఫీసు ఆవరణలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాల ద్వారా ఎన్నికల సిబ్బంది విధులను పర్యవేక్షించారు. కమాండ్ కంట్రోల్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, షిఫ్టుల వారీగా 24 గంటలు విధులు నిర్వహించాలని ఆదేశించారు. ముఖ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చెప్పాలని అన్నారు.

చొప్పదండి నామినేషన్ కేంద్రాల పరిశీలన

చొప్పదండి మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా చొప్పదండి మునిసిపల్ ఆఫీసులో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ పమేలా సత్పతి పరిశీలించారు. హెల్ప్ డెస్క్ సిబ్బంది అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేయాలని, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలు స్పష్టంగా వివరించాలని తెలిపారు. చొప్పదండి వార్డ్ స్థానాలకు ఇప్పటివరకు దాఖలైన నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ పత్రాలను పరిశీలించారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని అన్నారు.

నామినేషన్ సెంటర్ వద్ద హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటుచేశామని, విధుల్లో ఉన్న ప్రభుత్వ సిబ్బంది నామపత్రాలను దాఖలు చేసే విషయంలో అభ్యర్థులకు అవసరమైన సహకారం అందించాలని సూచించారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని అన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా ఉన్నతాధికారులను సంప్రదించాలని సూచించారు. కలెక్టర్ వెంట చొప్పదండి మునిసిపల్ కమిషనర్ మనోహర్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News