Monday, February 23, 2026
Homeసాహిత్యంBook Launch | ‘శూన్యం-కవిత్వం, బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

Book Launch | ‘శూన్యం-కవిత్వం, బిగ్ బ్యాంగ్’ ఆవిష్కరణ

తెలంగాణ లెక్చరర్స్ ఫోరం(Telangana Lecturers Forum-TLF) రాష్ట్ర కార్యదర్శి, నాగర్ కర్నూలు జిల్లా కేంద్రానికి చెందిన ఫిజిక్స్ అరుణ్ కుమార్(Physics Arun Kumar) రాసిన శూన్యం-కవిత్వం(Shoonyam-Kavithwam), బిగ్ బ్యాంగ్(Big Bang) వ్యాసాల సంపుటి(Collection of Articles)ని సోమవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ బీ-స్మార్ట్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి శేఖర్ రెడ్డి, టీఎల్ఎఫ్ చైర్మన్ డాక్టర్ కత్తి వెంకటస్వామి, రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణయ్య సంయుక్తంగా పుస్తకావిష్కరణ చేసి పరిచయ సభను నిర్వహించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ శాస్త్రీయ స్పృహ(Scientific Consciousness)తో, దేశభక్తితో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చేలా ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నవ్యతతో కూడిన మానవీయ కోణంలో సామాజిక మార్పే లక్ష్యంగా అరుణ్ అద్భుత రచనలు చేస్తున్నారని ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని పుస్తకాలు రాయాలని ఆకాంక్షించారు. అరుణ్‌ను శాలువాతో సత్కరించారు (Fecilitation). తనను ప్రోత్సహిస్తున్న పలువురికి అరుణ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లేపల్లి వేణు, రవి, శ్రీనివాస్ రెడ్డి, మార్కండేయ, కురుమూర్తి, సదానందం, ఫరీద్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News