హైదరాబాద్: సమాచార, పౌర సంబంధాల శాఖ జాయింట్ డైరెక్టర్ కన్నెకంటి వెంకట రమణ (Kannekanti Venkata Ramana) రాసిన JEWELS OF ASAF JAHI’S-the Glory of WARANGAL అనే కాఫీ టేబుల్ బుక్(Coffee Table Book)ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కె.రామకృష్ణారావు ఆవిష్కరించారు. సచివాలయంలోని ఆయన ఛాంబర్‌లో ఈ కార్యక్రమం జరిగింది. సమాచార, పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ సి.హెచ్.ప్రియాంక హాజరయ్యారు. వరంగల్ నగరంలో అసఫ్‌జాహీల హయాంలో నిర్మించిన అద్భుత కట్టడాలు(Amazing Buildings), వరంగల్ కేంద్రంగా పాలన చేసిన సుబేదారుల (Subedar) వివరాలు, వారి చరిత్రతో కూడిన ఈ పుస్తకం చరిత్ర పరిశోధకులకు, పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యేవారికి ఉపయోగపడుతుందని సి.ఎస్ (CS) అన్నారు.
పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తూనే చారిత్రక (History) అంశాలతో బుక్ వెలువరించడం అభినందనీయమని ప్రశంసించారు. వరంగల్ అంటే కాకతీయుల (Kakatiya) పాలన, వేయి స్తంభాల గుడి, ఖిలా వరంగల్, భద్రకాళి ఆలయం (Bhadrakali Temple) వెంటనే గుర్తొస్తాయి. అయితే.. వరంగల్ నగరంలో అడుగుపెట్టగానే కాజిపేట (Kazipet) నుంచి మామునూర్ వరకు నిజాం నవాబులు నిర్మించిన అద్భుత భవనాలు, కాజిపేట రైల్వే స్టేషన్, ప్రస్తుత మిషన్ భగీరథ పథకమైన ఇంటింటికి తాగు నీరందించే ధర్మసాగర్ ఫిల్టర్ బెడ్ ఎన్నో ఉన్నాయి. వీటితోపాటు వరంగల్ కేంద్రంగా వరంగల్ సుబాహ్ గా ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలోని కొన్నిప్రాంతాలు ఉండేవి. ఈ వరంగల్ సుబేదారులుగా ఎవరెవరు ఉన్నారు. వారి ప్రత్యేకతలేమిటి, ఈ విషయమై కొన్ని అరుదైన, విశేషాలతో కూడిన సమాచారంతోపాటు నిజాం నిర్మిత హెరిటేజ్ కట్టడాల ఫొటోలతో కలిపి ఈ పుస్తకాన్ని రూపొందించారు.
