Wednesday, March 4, 2026
HomeతెలంగాణWEF | రేవంత్ బృందం తొలిరోజు బిజీబిజీ

WEF | రేవంత్ బృందం తొలిరోజు బిజీబిజీ

దావోస్‌(స్విట్జర్లాండ్)లోని ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు(World Economic Forum Conference)లో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ రైజింగ్ ప్రతినిధుల బృందం(Telangana Rising delegation).. తొలి రోజు బిజీబిజీగా గడిపింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో ఇజ్రాయెల్ ఇన్నోవేషన్ అథారిటీ ఛైర్మన్ అలోన్ స్టోపెల్ భేటీ అయ్యారు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయం, వాతావరణ మార్పులకు సంబంధించిన ఇన్నోవేషన్ స్టార్టప్‌ల(Innovation-Driven Startups)కు సహకారాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్‌టెక్ ఇన్నోవేషన్‌, హెల్త్‌టెక్, అగ్రి టెక్, సైబర్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ వంటి సాంకేతిక రంగాల్లో తెలంగాణ స్టార్టప్‌లకు ఇజ్రాయెల్ మద్దతుతోపాటు భాగస్వామ్యాన్ని పంచుకుంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహా పలు రంగాల్లో ఇజ్రాయెలీ స్టార్టప్‌లతో కలిసి తెలంగాణ పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించనుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News