ఆదివాసీ వీరవనితలు సమ్మక్క, సారలమ్మ(Sammakka Saaralamma)లు కొలువైన మేడారం(Medaram) జంపన్న వాగు(Jampanna Vagu)లో నిరంతరం నీరు ప్రవహించే విధంగా రామప్ప–లక్నవరం నుంచి పైప్‌లైన్ ద్వారా నీటిని తరలిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పుణ్యక్షేత్రాన్ని తిరుమల-తిరుపతి, కుంభమేళాలను తలపించేలా, నిత్యం భక్తులు సందర్శించేలా మేడారం ఆలయ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
✅ సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా మేడారంలో నిర్వహించిన సాంస్కృతిక ఉత్సవాల్లో సీఎం, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
✅ మేడారంలో జరిగిన మంత్రి మండలి సమావేశం(Cabinet Meeting) అనంతరం నిర్వహించిన ఈ ఉత్సవంలో సీఎం మాట్లాడుతూ ఆదివాసీ సోదర సోదరీమణులందరికీ సమ్మక్క-సారలమ్మ జాతర శుభాకాంక్షలు తెలిపారు. నిరంతరం భక్తులు, పర్యాటకులు సందర్శించేలా మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.
✅ గుడి లేని తల్లులను గుండె నిండా నింపుకొని జరుపుకునే అతిపెద్ద మేడారం జాతర కోసం చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తిగా సంతృప్తినిచ్చాయి. 2023 ఫిబ్రవరి 6న ఈ ఆలయాన్ని సందర్శించిన సందర్భంగా ప్రపంచానికి ఆదర్శంగా నిలిచేలా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతామని చెప్పాం.
✅ ఇచ్చిన మాట ప్రకారం సమ్మక్క, సారలమ్మ ఆలయాన్ని కుంభమేళాను తలపించేలా ఆదివాసీలనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరినీ ఆకర్షించేలా తీర్చిదిద్దాం. ఇది ఒక అరుదైన సందర్భం. అద్భుతమైన సన్నివేశం. వంద రోజుల్లో పనులు పూర్తిచేయాలని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. జాతర ప్రారంభమయ్యే జనవరి 28 నాటికి పూర్తిచేయాలని చెప్పాను.
✅ మేడారం ఆలయ పునరుద్ధరణ చేపట్టడం నాకు జీవితకాలం గుర్తుండిపోయే సందర్భం. జీవిత కాలంలో ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పని చేశామా అని వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు సంతృప్తినిచ్చే ఘట్టం ఇది. జీవితాంతం గుర్తుండిపోయే అరుదైన అవకాశం.
✅ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ తెలంగాణలో గానీ హైదరాబాద్ బయట మంత్రివర్గ సమావేశం నిర్వహించిన సందర్భం లేదు. అలాంటి సమావేశాన్ని ఆదివాసీ ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ పుణ్యక్షేత్రం మేడారంలో నిర్వహించడంపై మంత్రివర్గ సహచరులందరూ సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం గుడిని ప్రారంభించి భక్తులకు అంకితం చేస్తామని వివరించారు.
CM Revanth | మేడారం పునరుద్ధరణ జీవితాంతం గుర్తుంటుంది
- Advertisement -

