Friday, October 10, 2025
ePaper
HomeతెలంగాణCM REVANTH REDDY | మల్లిఖార్జున ఖర్గేని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

CM REVANTH REDDY | మల్లిఖార్జున ఖర్గేని పరామర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

బెంగుళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పాటు, సుప్రీంకోర్టులో విచారణ అంశాలు ఖర్గేతో సిఎం రేవంత్ చర్చించినట్టుగా తెలిసింది. ఇటీవల ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖర్గే అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయన బెంగళూరులోని ప్రఖ్యాత ఎంఎస్ రామయ్య ఆస్పత్రిలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొంది డిశ్చార్ అయ్యారు. ఖర్గే శ్వాస సంబంధిత సమస్యలు, జ్వరంతో బాధపడుతుండగా ఆయన గుండె వేగం తగ్గకుండా ఉండేందుకు వైద్యులు పేస్ మేకర్ ఇంప్లాట్ సర్జరీ చేసిన విషయం విధితమే. అందులో భాగంగా సిఎం బెంగళూరుకు వెళ్లారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News