ప్రజా పాలన(Praja palana)–ప్రజా విజయోత్సవాల్లో భాగంగా సిద్ధిపేట జిల్లా(Siddipet District) హుస్నాబాద్(Husnabad)లో రూ.262.78 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, గడ్డం వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం శంకుస్థాపన చేసిన అభివృద్ధి పనుల వివరాలు..
- రూ.44.12 కోట్లతో ఇంజనీరింగ్ కళాశాల నిర్మాణం
- రూ.45.15 కోట్లతో హుస్నాబాద్‌లో ATC ఏర్పాటుకు శంకుస్థాపన
- రూ.20 కోట్లతో హుస్నాబాద్ మునిసిపాలిటీ పరిధిలో అభివృద్ధి పనులు
- రూ.8.60 కోట్లతో RTA యూనిట్ కార్యాలయం
- రూ.86 కోట్లతో హుస్నాబాద్ అర్బన్-కొత్తపల్లి ప్యాకేజీ-1లో భాగంగా 4 లైన్ల రహదారి నిర్మాణం
- రూ.58.91 కోట్లతో హుస్నాబాద్-అక్కన్నపేట 4 లైన్ల రహదారి నిర్మాణం
- Advertisement -
