తెలంగాణలోని వెనకబడిన ఆదిలాబాద్ జిల్లాను అభివృద్ధి చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పలు కీలక హామీలు ఇచ్చారు. అభివృద్ధి చెందిన జిల్లా(Developed District)గా తెలంగాణలో అగ్రస్థానం(Top in Telangana)లో నిలబెట్టేలా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాలు కార్యక్రమాల్లో భాగంగా ఆదిలాబాద్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడుతూ.. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు, చనాక–కొరాట ప్రాజెక్టు, విమానాశ్రయం(Airport), విశ్వవిద్యాలయం (University) ఏర్పాటు, సిమెంట్ ఫ్యాక్టరీ (Cement Factory) నిర్మాణం వంటి కీలకమైన ప్రాజెక్టులపై స్పష్టమైన ప్రకటన చేశారు.
- తుమ్మిడిహట్టి వద్ద డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టి ఈ జిల్లా పంట పొలాలకు నీళ్లిస్తామన్నారు. – త్వరలోనే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించి ఆదిలాబాద్ జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరుచేస్తామని ప్రకటించారు.
- జిల్లాకు విశ్వవిద్యాలయం మంజూరు చేస్తామని, దాన్ని ఎక్కడ పెట్టాలన్నది స్థలం ఎంపికను ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని చెప్పారు.
- ఆ వర్సిటీని ఇంద్రవెల్లిలో పెట్టడమే కాకుండా దానికి కొమురం భీం విశ్వవిద్యాలయంగా నామకరణం చేస్తే మరింత బాగుంటుందని సూచించారు.
- ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం తిరిగే లోపు 61 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేశాం.
- ప్రజా పాలన–ప్రజా విజయోత్సవ సంబరాలు ముగిన తర్వాత సమీక్ష నిర్వహించి మరో 40 వేల ఉద్యోగాల నియామకాల ప్రక్రియ చేపడతాం.
- మొత్తంగా లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించారు.
- Advertisement -
