ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandra Babu) బుధవారం దుబాయ్(Dubai)కి చేరుకున్నారు. విశాఖ(Vishaka)లో నవంబర్‌లో జరిగే సిఐఐ భాగస్వామ్య సదస్సు(CII Summit)కి పారిశ్రామికవేత్తల(Industrialists)ను ఆహ్వానించేందుకు ఆయన యూఏఈ(UAE) పర్యటనకు వెళ్లారు. రాష్ట్రానికి పెట్టుబడులు సాధించేందుకు అక్కడ మూడు రోజులు పర్యటిస్తారు. విమానాశ్రయంలో స్థానిక తెలుగు ప్రజలు (Telugu People) చంద్రబాబుకు ఘనస్వాగతం (Grand Welcome) పలికారు. వారి ఆప్యాయత తనకెంతో ఆనందం కలిగించిందని ఆయన సామాజికమాధ్యమాల్లో పేర్కొన్నారు.

