Wednesday, February 11, 2026
Homeఆంధ్రప్రదేశ్Amaravathi | వేంకటేశ్వర స్వామి ఆలయ పనులకు శంకుస్థాపన

Amaravathi | వేంకటేశ్వర స్వామి ఆలయ పనులకు శంకుస్థాపన

అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ (Sri Venkateswara Swamy Temple) పనులకు సీఎం చంద్రబాబు (CM Chandra Babu) శంకుస్థాపన (Foundation stone laying) చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక పవిత్ర దేవాలయమైన వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనులకు సంకల్పించామని చెప్పారు. దేవతల రాజధాని (capital of the gods) అమరావతి.. మన రాజధాని అమరావతి అని తెలిపారు. ఆ పేరు పెట్టడానికి కూడా దేవుడు తనకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో కలియుగ దైవం (God of Kali Yuga) అవతరించారని అన్నారు.

సీఎం చంద్రబాబు ఇంకా ఏమన్నారంటే..

  • 2019లో ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించాం.
  • ఈ ప్రాంత రైతులకు దేవుడి సన్నిధి నుంచి ధన్యవాదాలు, కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాను.
  • పవిత్రమైన కార్యక్రమానికి ప్రజలు సహకరించాలి.
  • ఇక్కడి రైతులు సహకరించి 33 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ల్యాండ్ పూలింగ్ విధానంలో ఇచ్చారు.
  • 25 ఎకరాల్లో పవిత్రమైన ప్రదేశం, కృష్ణా నది ఒడ్డున వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని నిర్మించుకుంటున్నాం.
  • ఈ అమరావతి విషయంలో ఎవరికీ అనుమానం అవసరం లేదు.
  • దేవతల రాజధానిగా అమరావతి ఏవిధంగా ఉంటుందో.. ఆ నమూనాగా మన అమరావతి ఉండాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నా.
  • ఎన్టీఆర్ అన్నదానం 1983లో ప్రారంభించారు.
  • నేను 2003లో ప్రాణదాణం తిరుపతిలో ప్రారంభించాను.
  • బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవుడికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వెళ్తుంటే 23 క్లేమోర్ మైన్స్ పెట్టి బ్లాస్ట్ చేస్తే ఆ వెంకటేశ్వరుడు నాకు ప్రాణభిక్ష పెట్టారు.
  • నేను, మా కుటుంబం ఇంటి దైవంగా వెంకటేశ్వరస్వామికి కొలుస్తాం.
  • మా ఇంటి నుంచి చూస్తే స్వామి కొలువున్న శేషాచలం పర్వతం కనబడతుంది.
  • ఆయన్ని చూస్తూ బతికి, స్వామి పాదపద్మాల చెంత తరించాం.
  • వేంకటేశ్వర స్వామికి అప్రతిష్ట తెచ్చే పనులు చేయను. ఎవరినీ చేయనివ్వను.
  • ఆ దేవుడి సన్నిధిలో మనం ఉన్నప్పుడు పవిత్ర, పరిశుభద్రత, స్వచ్ఛమైన ఆలోచన ఉండాలి. అప్పుడే నిజమైన భక్తితో పని చేసినట్లు అవుతుంది.
  • నేను ఎప్పుడు తిరుపతి వెళ్లినా క్యూలైన్‌లోనే భక్తితో వెళ్తాను.
  • దేవుడి దగ్గరకు పెత్తందారుగా వెళ్లకూడదు. తప్పు చేసిన వారిని ఈ జన్మలోనే స్వామి శిక్షిస్తారు.
  • ఆయన పవిత్రతను ఆయనే కాపాడుకుంటున్నారు.
  • గత ప్రభుత్వం విధ్వంసం తప్ప మంచి చేసిన సందర్భాలు లేవు. మంచి సంకల్పంతో రైతులు భూములు ఇస్తే నరకాన్ని చూపించారు.
  • మీరు వేంకటేశ్వరస్వామిని నమ్ముకున్నారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర చేసి రాజధానిని కాపాడుకోవడానికి పాటుపడ్డారు.
  • ఈ పవిత్రమైన దేవాలయాలయాన్ని రూ.260 కోట్లతో పూర్తి చేస్తాం.
  • అమరావతినే కాకుండా ఈ ప్రాంతాన్ని కాపాడే శక్తి ఈ దేవాలయానికి ఉంది.
  • రెండున్నరేళ్లలో ఈ పనులు పూర్తి చేయాలని టీటీడీని కోరుతున్నాను.
  • ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం, మూడోది శ్రీవారి సేవకులు, నాలుగోది దేవాలయ నిర్మాణం.
  • ఆలయాల నిర్మాణాలకు భక్తులు ముందుకు రావాలి.
  • ఆరోగ్యం, సంపద, ఆనందం ప్రతి ఒక్కరికీ ఇవ్వాలని వేంకటేశ్వరస్వామిని కోరుకుంటున్నాను.
- Advertisement -
RELATED ARTICLES

Latest News