Monday, October 27, 2025
ePaper
HomeతెలంగాణCM Revanth | రవాణా చెక్ పోస్టులు మూసేయండి

CM Revanth | రవాణా చెక్ పోస్టులు మూసేయండి

సీఎం రేవంత్ ఆదేశం

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రవాణా శాఖ చెక్ పోస్టుల(RTO Checkpost)ను తక్షణం మూసేయాలని సీఎం రేవంత్ (CM Revanth) రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు రవాణా కమిషనర్.. డీటీఓ(DTO)లకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా జిల్లా రవాణా అధికారులు(డీటీఓలు) స్వయంగా చెక్ పోస్టుల వద్ద ప్రస్తుతం ఉన్న బోర్డుల, బారికేడ్ల తొలగింపులను పర్యవేక్షించి, చెక్ పోస్టులు మూసివేసిట్లు కొత్త బోర్డులు ఏర్పాటుచేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

చెక్ పోస్టుల వద్ద విధుల్లో ఉన్న సిబ్బందిని వెంటనే ఉపసంహరించాలని సూచించారు. ఆయా ప్రాంతాల్లో చెక్ పోస్టుల బోర్డులను, బారికేడ్లను తొలగించాలని డీటీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ తొలగింపు ప్రక్రియను వీడియో (Video) తీసి భద్రపరచాలని చెప్పారు. రికార్డులు, ఫర్నీచర్ తదితర సామగ్రి, కంప్యూటర్లు, ఇతర వస్తువులను డీటీఓ ఆఫీసులకు తరలించాలని, పరిపాలన రికార్డులు, క్యాష్ బుక్స్, రిసీట్‌లు, చాలాన్ల(Challan)ను డీటీవో ఆఫీసులో భద్రపరచాలని పేర్కొన్నారు.

ఇన్నాళ్లూ చెక్ పోస్టులు ఉన్న స్థలాల్లో వాహనాల రాకపోకలకు అడ్డంకులు లేకుండా చూడాలని స్పష్టంగా తెలిపారు. చెక్ పోస్టులను మూసివేశామని, సిబ్బందిని రీడిప్లాయ్ చేశామని, రికార్డులను భద్రపరిచిన విషయాలన్నింటిపైనా బుధవారం సాయంత్రం 5 గంటల్లో నివేదిక (Report) ఇవ్వాలని డీటీఓలను ఆదేశిస్తూ రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News