పోలీస్ అమరవీరుల మహోత్సవాల నేపథ్యంలో, మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఆనంద్ బాగ్ రెసిడెంట్స్ అసోసియేషన్ నివాసితులతో పౌరులు – పోలీసు పరస్పర అభిప్రాయల మార్పిడి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఈ సందర్భంగా విధినిర్వహణలో భద్రత కొరకు ప్రాణాలు అర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాలను స్మరించుకొని వారికి నివాళులు అర్పించారు. అదేవిధంగా ప్రజా భద్రత, శాంతి భద్రతా పరిరక్షణలో పోలీసు శాఖ పోషిస్తున్న కీలక పాత్రపై నేర నియంత్రణ, మహిళా భద్రత, ట్రాఫిక్ నియమాల అమలు, యువతలో డ్రగ్స్ నిరోధం, సైబర్ నేరాలపై జాగ్రత్తలు వంటి పలు అంశాలపై పోలీసు అధికారులు ప్రజలకు స్పష్టంగా వివరించడం జరిగింది.

ఇలాంటి సమావేశాల ద్వారా పోలీసు-ప్రజల మధ్య నమ్మకం, సమన్వయం మరింత బలోపేతమై ప్రజా భద్రతను ఇంకా మెరుగుపరచడమే లక్ష్యం అని పోలీస్ అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అదనపు డిసిపి వెంకటరమణ, మల్కాజిగిరి సిఐ సత్యనారాయణ, మల్కాజిగిరి డి ఐ శ్రీశైలం, ఎస్సై ఉపేందర్ తోపాటు కాలనీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
