తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ ముని మనుమరాలు చిట్యాల శ్వేత జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక న్యాయం కోసం పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ వారసత్వాన్ని కొనసాగిస్తున్న చిట్యాల శ్వేత ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న యువ నాయకుడు నవీన్ యాదవ్‌కి తమ కుటుంబం సంపూర్ణ మద్దతు ఇస్తోందని చెప్పారు. ప్రజల కోసం నిజాయితీగా పనిచేసే నాయకుడు గెలవాలని ఆకాంక్షించారు. నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. వీరనారి చాకలి ఐలమ్మ త్యాగస్ఫూర్తి మనందరికీ మార్గదర్శకమని తెలిపారు. ఆ బాటలోనే తాను ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తానని హామీ ఇచ్చారు.
