నేపాల్ (Nepal) వెయ్యి రూపాయల బ్యాంక్ నోట్లను చైనా(Chaina)లో ముద్రించనున్నారు. ఈ కాంట్రాక్ట్‌ను చైనా సంస్థ దక్కించుకుంది. ప్రాజెక్టు ఖరీదు దాదాపు 17 మిలియన్ డాలర్లని నేపాల్ బ్యాంక్ కరెన్సీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (Nepal Bank Currency Management Department) తెలిపింది. నేపాల్‌లో చెలామణిలోకి తేనున్న 430 మిలియన్ల వెయి రూపాయల నోట్ల డిజైన్(Design), ప్రింటింగ్(Printing), సప్లై(Supply), డెలివరీ(Delivery) పనులను చైనాలోని బ్యాంక్ నోట్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ సొంతం చేసుకుంది.

ఈ మేరకు నేపాల్ రాష్ట్ర బ్యాంక్.. ఎన్ఆర్‌బీ(Nrb).. లెటర్ ఆఫ్ ఇంటెంట్‌ను జారీ చేసింది. ఈ ప్రాజెక్టు బడ్జెట్ 16.985 మిలియన్ డాలర్లని ఎన్ఆర్‌బీ కరెన్సీ మేనేజ్‌మెంట్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. చైనా కంపెనీ తక్కువ ధరకు బిడ్ వేయటంతో ఎంపిక చేసినట్లు తెలిపింది. చైనా కంపెనీ గతంలోనూ నేపాల్ బ్యాంక్ నోట్లను ముద్రించింది. 5, 10, 100, 500 డినామినేషన్లను (Denominations) సరఫరా చేసినట్లు నేపాల్ అధికారులు వివరించారు.
