Tuesday, February 24, 2026
Homeఅంతర్జాతీయంChina | కొనసాగుతున్న చైనా దూకుడు..

China | కొనసాగుతున్న చైనా దూకుడు..

  • రహస్య అంతరిక్ష విమానాన్ని భూ కక్షలోకి ప్రవేశపెట్టిన వైనం..

అంతరిక్ష ప్రయోగాల్లో పొరుగు దేశం చైనా తన దూకుడును కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా తమ రహస్య అంతరిక్ష విమానం షెన్‌లాంగ్‌ ను మరోసారి భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. జియుక్వాన్ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుంచి లాంగ్‌మార్చ్‌-2 ఎఫ్‌ రాకెట్‌ సాయంతో ఫిబ్రవరి 7న ఈ స్పేస్‌ ప్లేన్‌ను అంతరిక్షంలోకి పంపించారు.

చైనా షెన్‌లాంగ్‌ను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టడం ఇది నాలుగోసారి. అయితే ఈ అంతరిక్ష విమానం ప్రయోగాలకు సంబంధించిన సమాచారాన్ని చైనా ప్రభుత్వం అత్యంత రహస్యంగా ఉంచుతోంది. అందుకే ఆ ప్రయోగాలపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో అంతరిక్షాన్ని మరింత సమర్థంగా వినియోగించుకోవడం, అందుబాటు వ్యయాల్లో ప్రయోగాలను చేపట్టడం లాంటి అంశాలపై అధ్యయనం చేసేందుకు వీలుగా తాము ఈ అంతరిక్ష విమాన ప్రయోగాలు చేపడుతున్నట్లు బీజింగ్‌ ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

- Advertisement -

అయితే విమానం డిజైన్‌, దాని లక్ష్యాలు, ఎన్ని రోజులు కక్ష్యలో ఉండనుంది అనే వివరాలను మాత్రం చైనా బయటపెట్టడం లేదు. దాంతో పలు దేశాలకు చెందిన అంతరిక్ష నిపుణులు, ట్రాకర్లు భూ కక్ష్యలోని షెన్‌లాంగ్‌ను ట్రాక్‌ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో చైనా షెన్‌లాంగ్‌ మిషన్‌లు చేపట్టిన సమయంలో విమానం కనిష్ఠంగా రెండు రోజుల నుంచి గరిష్ఠంగా ఎనిమిది నెలల వరకు కక్ష్యలో ఉన్నట్లు వారు గుర్తించారు. అది కక్ష్యలోకి చిన్న ఉప గ్రహాల వంటి వాటిని విడుదల చేయడం గమనించినట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News