- బాటసింగారం పండ్ల మార్కెట్ పై నజర్..
- క్రయ, విక్రయాలు వ్యవహారం పరిశీలన..
మామిడి పండ్ల సీజన్ నేపథ్యంలో సోమవారం ఉదయం బాటసింగారం పండ్ల మార్కెట్ ని సందర్శించి మామిడి క్రయ, విక్రయాలు పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధు సుధన్ రెడ్డి, పాలకవర్గం సభ్యులు. ఈ సందర్భంగా గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధు సూదన్రెడ్డి మాట్లాడుతూ..
రైతులను కమిషన్ల పేరుతో ఇబ్బందులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని, అధిక రసాయినాలు వాడిన లైసెన్సు రద్దు చేస్తామని,
మామిడి సీజన్ సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని, తగిన సౌకర్యాలు కల్పిస్తా మని, గత ఏడాది ఒక లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల దిగుబడి జరిగిందని, ఈ ఏడాది ఎక్కువ మొత్తంలో రావొచ్చని అంచనా వేస్తున్నామన్నారు.

మామిడి సీజన్ సందర్భంగా రైతులకు, వ్యాపారులకు, వినియోగదారులకు అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తుందని అన్నారు. అధిక కమీషన్ల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసిన వారికి రావాల్సిన బకాయిలు ఇవ్వకున్నా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అదేవిధంగా పండ్లను పండడానికి FSSAI అనుమతించిన ఇతనాల్ నే ఉపయోగించాలని, దానిని ఎక్కువ మొత్తంలో ఉపయోగించిన క్రిమినల్ కేసులు నమోదు చేపిస్తామని తెలిపారు. ప్రతివారం మా పాలకవర్గం తిరిగి పరిశీలిస్తామని చెప్పారు. ఎప్పటికప్పడు అధికారులను అప్రమత్తం చేస్తూ నిరంతరం తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ CH.బాస్కర చారి, సభ్యులు బండి మధుసూదన్ రావు, మచ్చెందర్ రెడ్డి, గణేశ్ నాయక్, నరసింహ, రఘుపతి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంజయ్య, వెంకటేశ్వర్లు గుప్తా, ఇబ్రహీం, మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి L.శ్రీనివాస్ తో పాటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
