- మాజీ మున్సిపల్ కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్
ఈనెల 5వ తారీఖున మధ్యాహ్నం ఒకటింటికి నర్సంపేట పట్టణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్నారు. నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి నేతృత్వంలో నర్సంపేట పట్టణము, నియోజకవర్గంలోని అనేక అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి 228 కోట్లతో రోడ్ల అభివృద్ధి, ఇంటిగ్రేటెడ్ స్కూల్200 కోట్లతో, 150 కోట్లతో మెడికల్ కాలేజ్, 25 కోట్లతో నర్సింగ్ కాలేజ్, 20 కోట్లతో నర్సంపేట పట్టణం మున్సిపాలిటీ విలీన గ్రామాలకు సిసి రోడ్లు డ్రైనేజీలు కల్వర్టులు సెంట్రల్ లైటింగ్, (నర్సంపేట పోలీస్ స్టేషన్ నుండి నాగూర్ల పల్లె మాదన్నపేట వరకు సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్డు సిసి, నర్సంపేట నుండి మొద్దుం పురం రాజ పల్లె వరకు డబుల్ రోడ్డు సెంట్రల్ లైటింగ్, మహేశ్వరం లోపలికి సెంట్రల్ లైటింగ్ డబుల్ రోడ్డు.) తో పాటు మరో 400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు కు శంకుస్థాపన చేయనున్నారని వేముల సాంబయ్య గౌడ్ తెలిపారు.
ఈ సందర్భంగా బహిరంగ సభ స్థలాన్ని నర్సంపేట పట్టణ రఘుపతి రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలోమున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్ఎస్సై అరుణ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ పట్టణ ఉపాధ్యక్షులు వేముల సారంగం గౌడ్ పట్టణ కమిటీ కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ మండల నాయకులు పరిటాల నాగేశ్వరరావు, సభ్యులు తాళ్ల పెళ్లి, శ్రీనివాస్ గౌడ్, దండెం రతన్ కుమార్, కోయడి కిరణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
