Friday, October 3, 2025
ePaper
Homeక్రైమ్ వార్తలుఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌

ఏసీబీ వలలో పంచాయతీరాజ్‌ చీఫ్‌ ఇంజినీర్‌

లంచం తీసుకుంటుండగా కనకరత్నం పట్టివేత

తెలంగాణ పంచాయతీరాజ్‌ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ కనకరత్నం ఏసీబీ వలలో చిక్కారు. డీఈ బదిలీ విషయంలో ఆయన రూ. 50వేలు డిమాండ్‌ చేశారు. లంచం డబ్బు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఈ ఏడాది మార్చి 31న కనకరత్నం పదవీవిరమణ పొందారు. అయితే, ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిచింది. కాగా సొంత శాఖలోని డీఈ తాండూరు నుంచి వికారాబాద్‌కు బదిలీ చేయాలని కోరగా.. కనకరత్నం రూ.50వేలు లంచం అడిగారు. దీంతో డీఈ ఏసీబీని ఆశ్రయించారు. దీంతో కనకరత్నం లంచం తీసుకుంటుండగా.. ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ రాజ్‌ కార్యాలయంతో పాటు కేపీహెచ్‌బీ కాలనీలోని ఆయన నివాసంలోనూ సోదాలు నిర్వహించారు. భారీగా నగదు, ఆస్తులు గుర్తించింనట్లు తెలుస్తోంది. అనంతరం కనకరత్నంను అరెస్టు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ వెల్లడించారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News