కరీంనగర్, నవంబర్ 16(ఆదాబ్ హైదరాబాద్ ): వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా (Working Journalists of India-WJI) కరీంనగర్ జిల్లా శాఖ కోశాధికారి(Treasurer)గా సీనియర్(Senior) జర్నలిస్ట్ (Journalist) చిట్టిమల్ల మహేందర్ నియామకం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం స్థానిక సప్తగిరి కాలనీలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో డబ్ల్యూజేఐ జిల్లా శాఖ నూతన కార్యవర్గ ఎన్నికలు (Executive Committee Elections) జరిగాయి. ఇందులో మహేందర్ కోశాధికారిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నిక పట్ల పలువురు జర్నలిస్టులు నల్లగొండ సత్తయ్య, శ్రీధర్, గోవర్ధన్, తిరుపతి, వేణు, మహేష్, సతీష్, బీసీ సంఘం నాయకులు ఆది మల్లేశం, నర్సింగోజు శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, నితిన్, చిగుర్ల శ్రీనివాస్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
