Thursday, February 12, 2026
Homeఆరోగ్యంCancer | అవగాహనతో క్యాన్సర్‌కు చెక్

Cancer | అవగాహనతో క్యాన్సర్‌కు చెక్

క్యాన్సర్ అనేది శరీరంలోని కొన్ని కణాలు (Cells) అదుపులేకుండా పెరిగి ఇతర భాగాలకు వ్యాపించేవిధంగా మారే వ్యాధి(Disease). సాధారణ కణాల పెరుగుదల నియంత్రణలో ఉంటే క్యాన్సర్ కణాలు నియంత్రణ లేకుండా పెరిగి గడ్డలను (కణితులు-Tumors) ఏర్పరుస్తాయి. ఈ గడ్డలు ఆరోగ్యకర కణాలను తొలగిస్తాయి లేదా అవయవాలను నాశనం చేస్తాయి.

క్యాన్సర్‌కు స్పష్టమైన కారణం లేదు. కానీ కొన్ని కారణాలు క్యాన్సర్ రాకకు దోహదం చేస్తాయి. సిగరెట్లు(Cigarettes), బీడీ(Beedi)లు, పాన్ మసాలా (Pan Masala) వంటివి ఊపిరితిత్తులు(Lungs), నోరు(Mouth), గొంతు వంటి క్యాన్సర్లకు ప్రధాన కారణం. అధికంగా మద్యం తాగడం కాలేయం, నోరు, గొంతు క్యాన్సర్లకు దారితీస్తుంది.

- Advertisement -

ఆహారపు అలవాట్లు(Food Habits):

అధిక కొవ్వులు, చక్కెరలు ఉన్న ఆహారం, తక్కువ కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. వ్యాయామం చేయకపోవడం కొన్ని రకాల క్యాన్సర్లకు కారణం కావచ్చు. కుటుంబంలో క్యాన్సర్ ఉంటే వచ్చే అవకాశాలు ఎక్కువ. హెపటైటిస్ B, హెపటైటిస్ C వంటి వైరస్‌లు కాలేయ క్యాన్సర్‌కు కారణం కావచ్చు. అధిక రేడియేషన్ శరీర కణాలపై ప్రభావం చూపి క్యాన్సర్ కలిగించే అవకాశం ఉంది.

క్యాన్సర్ లక్షణాలు.. దాని రకం, స్థానం, దశపై ఆధారపడి ఉంటాయి. కొన్ని సాధారణ లక్షణాలను గమనిస్తే.. తీవ్ర అలసట, బరువు తగ్గడం, రక్తస్రావం లేదా రక్తపు ఉమ్మి, శ్వాసలో ఇబ్బంది, అవయవంలో గడ్డలు మొదలైనవి. క్యాన్సర్‌ను పూర్తిగా నివారించలేక పోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దాని ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

పొగాకు వాడకాన్ని మానుకోవడం.. ఊపిరితిత్తులు, నోరు, గొంతు వంటి క్యాన్సర్లను నివారించడంలో సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారంలో ఎక్కువ కూరగాయలు, పండ్లు, తక్కువ కొవ్వులు ఉండే ఆహారం తీసుకోవడం మంచిది. రోజూ వ్యాయామం చేయడం శరీరంలో క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గిస్తుంది. ఆల్కహాల్ తాగటాన్ని నిషేధించడం కూడా ముఖ్యమైన చర్య. క్యాన్సర్ నిర్ధారణలో తొలి దశలోనే పరీక్షలు చేయడం కీలకం.

క్యాన్సర్ చికిత్స అనేది.. దాని రకం, దశ, రోగి ఆరోగ్య స్థితిపై ఆధారపడి ఉంటుంది. కొన్ని ప్రధాన చికిత్స విధానాలు.. శస్త్రచికిత్స ద్వారా క్యాన్సర్ కణితులను తొలగించడం. రేడియేషన్ చికిత్స ద్వారా కణాలను నాశనం చేయడం. కీమోథెరపీ ద్వారా క్యాన్సర్ కణాలను నియంత్రించడం. నిర్దిష్ట క్యాన్సర్ కణాలపై చర్యలు తీసుకోవడం. క్యాన్సర్‌ను ప్రారంభ దశలో గుర్తించడం చాలా ముఖ్యం. కాబట్టి ఏదైనా అనుమానాస్పద లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించడం అత్యవసరం.

(నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా)

రామకిష్టయ్య సంగనభట్ల

- Advertisement -
RELATED ARTICLES

Latest News