భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సీపీ రాధాకృష్ణన్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు. జాతికి సేవ చేసేందుకు వచ్చిన అవకాశంలో ఆయన విజయం సాధిస్తారని నమ్ముతున్నట్లు సీఎం చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామిక విలువలను కాపాడటంలో ఆయనకు ఉన్న అపారమైన అనుభవం ఉపయోగపడుతుందని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు సి.పి.రాధాకృష్ణన్ కు ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన అపార అనుభవం, రాజనీతిజ్ఞత, ప్రజా సేవ పట్ల నిబద్ధత మన దేశాన్ని ఎంతో సుసంపన్నం చేస్తాయన్నారు. జ్ఞానం, గౌరవంతో ప్రజలకు సేవ చేయడంలో ఆయన గొప్ప విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు నారా లోకేష్ తెలిపారు. ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. ఆయన అపార అనుభవంతో దేశానికి సేవ చేస్తారని అన్నారు.
రాధాకృష్ణన్‌కు చంద్రబాబు, పవన్ అభినందనలు
RELATED ARTICLES
- Advertisment -