మోసాలకు కేరాఫ్ గా మారిన చండ్ర చంద్ర శేఖర్
- లేనివి ఉన్నట్లు చెప్పి అమాయక ప్రజలను బురిడి కొట్టించడమే ఇతగాడి వృత్తి..
- కొందుర్గ్ మండలంలో నాలా కన్వర్షన్ లేకుండా ఇనాం భూమిలో అక్రమ లే అవుట్..
- గ్రేటెడ్ కమ్యూనిటీ అంటూ కలరింగ్..
- అనుమతులు లేకుండా అడ్డగోలుగా నిర్మాణాలు చేస్తున్న వైనం..
- ప్రేక్షక పాత్రలో చెరుకుపల్లి కార్యదర్శి అశోక్
- రంగారెడ్డి జిల్లా డీపీఓ ఆదేశాలతో అక్రమ వెంచర్ పై జరిపిన విచారణ..
- అక్రమాలను గుర్తించి నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకున్న కార్యదర్శి..
- కార్యదర్శి అశోక్‌ను సస్పెండ్ చేసి అక్రమాలకు కట్టడి చేయాలని వెల్లువెత్తిన డిమాండ్స్..
‘స్వర్గసీమ’ కాదు ‘నరకసీమ’ అంటున్నారు సామాజికవేత్తలు.. చండ్ర చంద్రశేఖర్ రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో భారీ మోసాలు చేస్తూ జనాల నెత్తిన శఠగోపం పెడుతున్నాడని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.. అనుమతులు లేవు.. నాలా కన్వర్షన్ లేదు.. ఉన్నదల్లా అమాయకులను నిలువునా ముంచే పన్నాగమే..

రియల్ ఎస్టేట్ ముసుగులో సాగుతున్న ఒక భారీ దందాకు రంగారెడ్డి జిల్లా అడ్డాగా మారింది. “మీ ఇంట సిరులు కురిపిస్తాం.. అపురూపమైన నివాసాన్ని అందిస్తాం” అంటూ నమ్మబలికి, అమాయక ప్రజల రక్తాన్ని పిండుకుంటున్న చండ్ర చంద్రశేఖర్ అక్రమ సామ్రాజ్యాన్ని ‘ఆదాబ్ హైదరాబాద’ ఎన్నో సార్లు వెలుగులోకి తీసుకువచ్చింది.. స్వర్గసీమ, సిరుల సీమ, సుకేతన, అమోయ వంటి ఆకర్షణీయమైన పేర్లతో గాలం వేసి, కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ఈ ‘మాయగాడి’ వెనుక ఉన్న అసలు బాగోతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది..

రంగారెడ్డి జిల్లా, కొందుర్గు మండలం, చెరుకుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఈ భారీ వెంచర్ వెలిసింది. వ్యవసాయ భూమిని ‘నాలా’ కింద మార్చకుండానే, ప్లాట్లుగా విడగొట్టి అమ్మడం చట్టరీత్యా నేరం.. కానీ చండ్ర చంద్రశేఖర్ దృష్టిలో చట్టం అంటే ఒక లెక్కలేని అంశంగా మారింది.. సామాజిక మాధ్యమాలు, అడ్వర్టైజ్‌మెంట్లతో హోరెత్తిస్తూ.. అదిగో అనుమతులు, ఇదిగో డెవలప్‌మెంట్ అంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి..

ఈ వ్యవహారంలో చెరుకుపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి అశోక్ మౌనంగా ఉండి అక్రమాలకు ఇన్నాళ్లు పచ్చజెండా ఊపడంతో ఆక్రమ వెంచర్ కు ఆజ్యం పోసినట్లయింది.. బోగస్ వెంచర్ కళ్లముందే వెలుస్తున్నా, భూ రికార్డులలో వ్యవసాయ భూమిగా ఇనాం భూమిగా అడ్డదారిలో పొందిన పట్టా ఉన్న.. కార్యదర్శి ఎందుకు మౌనంగా ఉన్నారు..? రంగారెడ్డి జిల్లా డీపీఓ విచారణకు ఆదేశించినా వెంటనే డీఎల్పీఓ, ఎంపీఓ కలసి వెళ్లి అక్రమాలు చేస్తుంది ముమ్మాటికి వాస్తవమే నని తేల్చేశారు..దీనితో కార్యదర్శి అశోక్ విధుల పట్ల నిర్లక్ష వైఖరి నిర్ధారణ అవుతుంది..

ఇంతజరిగిన అక్రమ వెంచర్ పై చర్యలు తీసుకోకుండా నేటికి సైన్ బోర్డులు ఏర్పాటు చేయకుండా రెండు సార్లు నామమాత్రపు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడంలో మతలేబెంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది..ఇలా చేయడం అక్రమ వెంచర్ల కు పరోక్ష సహకారం అందించినట్లు కాదా..? అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 268 ప్రకారం.. కార్యదర్శి పరిధిలో జరుగుతున్న అక్రమాలను అరికట్టడంలో వైఫల్యం చెందిన కార్యదర్శి అశోక్ విధుల నుండి తొలగించాలని పలువురు సామాజికవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.

సదరు అక్రమ వెంచర్ వద్ద “ఇది అనధికారిక లేఅవుట్.. ఇక్కడ ప్లాట్లు కొనడం పంచాయతీ రాజ్ చట్టం నిబంధనలకు విరుద్ధం” అని జిల్లా యంత్రాంగం వెంటనే సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి.ప్రజలను మోసం చేస్తున్న చండ్ర చంద్రశేఖర్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేయాలి..విచారణను నీరుగార్చిన కార్యదర్శి అశోక్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి..చండ్ర చంద్రశేఖర్ సాగిస్తున్న స్వర్గ సీమా,సిరుల సీమా,సుకేతన,అమోయ పేర్లతో చేస్తున్న వెంచర్లలోని అక్రమాలను అమాయక ప్రజలు నష్టపోకుండా వాస్తవాలు ఆధారాలతో సహ మరో కథనం ద్వారా మీముందుకు తీసుకురానుంది
