Wednesday, February 11, 2026
HomeతెలంగాణTWJF | ఛలో సమాచార భవన్...

TWJF | ఛలో సమాచార భవన్…

  • టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు సత్తయ్య,

కరీంనగర్: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 1న తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ తలపెట్టిన చలో సమాచార భవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు నల్లగొండ సత్తయ్య శనివారం ఒక ప్రకటనలో కోరారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్న జర్నలిస్టులకు సంబంధించిన సమస్యలు ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం కొత్త అక్రెడిటేషన్ కార్డులు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. ఆరోగ్య భీమా పథకం కొత్త అక్రెడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలని, ఆరోగ్య బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలన్నారు. జర్నలిస్టులందరికీ ఇళ్లస్థలాలు మంజూరు చేయాలన్నారు. సంక్షోభంలో ఉన్న చిన్న, మధ్యతరహా పత్రికలను ఆదుకోవాలని, చిన్న, మధ్య తరహా పత్రికలను ఎంపానల్మెంట్ చేయాలన్నారు. ఈ డిమాండ్ల సాధనకై డిసెంబర్ ఒకటిన జరిగే ధర్నాలో జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News