Tuesday, February 10, 2026
Homeరంగారెడ్డిSarpanch | అన్ని హంగులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం.

Sarpanch | అన్ని హంగులతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం.

  • చాకలిదానిగుట్ట తండా సర్పంచ్ గుబ్రు చౌహన్.
  • 30లక్షల నిధులతో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్లు, వీధిలైట్లకు భూమిపూజ.

తమ గ్రామాన్ని అన్ని రకాలుగా హైటెక్ హంగులతో అభివృద్ధి చేస్తామని చాకలిదానిగుట్ట తండా సర్పంచ్ గుబ్రు చౌహన్ స్పష్టం చేశారు.నందిగామ మండల పరిధిలోని చాకలిదానిగుట్ట తండా గ్రామంలో శనివారం అండర్ డ్రైనేజ్, సిసి రోడ్లు, వీధిలైట్ల నిర్మాణ పనులకు సర్పంచ్ గుబ్రు చౌహన్ భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తమ గ్రామాన్ని అన్ని విధాలుగా హైటెక్ హంగులతో అభివృద్ధి చేస్తామన్నారు.

సుమారుగా 30 లక్షల రూపాయల నిధులతో అండర్ డ్రైనేజ్, సిసి రోడ్లు, వీధిలైట్ల కోసం నిర్మాణ పనులు ప్రారంభించారు. డైనేజి పాత్లవత్ శ్రీను ఇంటి నుంచి ముడావత్ మంగ్య ఇంటి వరకు వేస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామాన్ని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సహాయ సహకారాలతో గ్రామపంచాయతీనీ అన్ని హంగులతో, మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దుతామన్నారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మూడవత్ రవీందర్ నాయక్, వార్డ్ సభ్యులు పాత్లావత్ శ్రీను, పాత్లావత్ బుజ్జి శంకర్, మూడవత్ శాంతి శ్రీనివాస్, మెగావత్ నాగేష్, మెగవత్ పత్తి శ్రీను, పంచాయతీ కార్యదర్శి రవీందర్, నాయకులు మూడవత్ తులసిరాం, రూప్ సింగ్, లిoబియా, పాత్లావత్ కిషన్, చందర్, మూడవత్ సోమ్లా,పాత్లావత్ దీప్లా, మూడవత్ సురేష్, మూడవత్ రవీందర్, కారోబార్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News