- కొత్త ఉత్పత్తిని ఆవిష్కరించిన పీవీ సింధు
- కంఫర్ట్ రీ ఇంజినీర్డ్ అనే లోగోతో సోఫాల విభాగంలోకి అడుగు
- సర్టిఫైడ్ ఫోమ్‌లు, ప్రీమియం సామగ్రితో రూపొందే సోఫాలు
భారతదేశంలో నిద్రవిషయంలో ప్రత్యేకత సాధించిన సెంచురీ మాట్రెసెస్(Centuary Mattresses) ఇప్పుడుకొత్తగా సెంచురీ సోఫాలతో బెడ్రూంల నుంచి లివింగ్ రూంలలోకికూడా ప్రవేశించింది. వీటిని కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ పీవీసింధు హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఇన్నాళ్లూ పరుపులు, దిండ్లకే పరిమితమైన ఈ కంపెనీ ఇప్పుడు కంఫర్ట్ టెక్నాలజీలోకీఅడుగుపెట్టింది.
భారతదేశంలో ఫర్నిచర్ మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. దీంతోసెంచురీ సంస్థ ఆధునిక డిజైన్లు, కంఫర్ట్ సైన్స్ రెండింటినీమిళితం చేసి ఒక విభిన్నమైన సౌకర్యాన్ని అందించాలని లక్ష్యంగాపెట్టుకుంది. లోపల స్మార్ట్, బయట సాఫ్ట్ అనే సరికొత్త హామీతోసెంచురీ సోఫాలు రంగప్రవేశం చేస్తున్నాయి. ఇందులో 3 సీటర్, 2 సీటర్, సింగిల్ సీటర్, ఇంకా పొడవైన యూనిట్లు కూడాఉన్నాయి. వేర్వేరు ధరల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి.
ఈ సందర్భంగా సెంచురీ సోఫాస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉత్తమ్మలానీ (Uttam Malani) మాట్లాడుతూ, “గత 30 ఏళ్లుగా స్లీప్ కంఫర్ట్‌కుమారుపేరుగా, విశ్వసనీయమైన బ్రాండుగా సెంచురీ ఉంది. మాప్రయాణంలో సోఫాలకు విస్తరించడం మా ప్రయాణంలో చాలాసహజమైన పురోగతి. సోఫాలు అనేవి కేవలం ఫర్నిచర్ కాదు. అవి కుటుంబజీవితానికి, సమగ్ర ఆరోగ్యానికి కేంద్రస్థానం. ఇన్నాళ్లుగా కొన్ని కోట్ల కుటుంబాలకు మా పరుపులతో ఇచ్చినవిశ్వాసం, సౌకర్యం ఇప్పుడూ ఇస్తామని చెప్పడానికి గర్వంగాఉంది” అన్నారు.
పద్మభూషణ్ పురస్కార గ్రహీత, సెంచురీ బ్రాండ్ అంబాసిడర్పీవీ సింధు ఆవిష్కరించడంతో దీనికి మరింత ఆదరణలభిస్తోంది ఆమె ఎప్పుడూ కచ్చితత్వం సాధించడం కోసంనిర్విరామంగా శ్రమిస్తుంటారు. ఈ బ్రాండు ఇన్ని సంవత్సరాలుగానిలబడిన నిబద్దత, పనితీరులాంటి విలువలనే ఆమె కూడాపాటిస్తుంటారు.
“కష్టపడి పనిచేయడంతో పాటు విశ్రాంతి, కోలుకోవడం కూడాఅంతే ముఖ్యమని నేనెప్పుడూ విశ్వసిస్తాను. సోఫాల విభాగంలకివిస్తరించాలన్న సెంచురీ నిర్ణయం ఇంట్లోని ప్రతి మూలనూసౌకర్యవంతంగా రూపొందించాలన్న వారి నిబద్ధతకు నిదర్శనం. ఇన్నాళ్లూ వారి పరుపులు మనకు మంచి నిద్రను ఇస్తున్నట్లే, సోఫాలూ మెరుగైన జీవనాన్ని అందిస్తాయి” అని ఈ సందర్భంగాపీవీ సింధు తెలిపారు.
పూర్తిగా భారతదేశంలోనే రూపొందించి, ఉత్పత్తి చేసిన సెంచురీసోఫాలు మేక్ ఇన్ ఇండియా అనే స్ఫూర్తిని అందిపుచ్చుకుంది. స్థానిక సామాగ్రి, వృత్తి నిపుణులకే పెద్దపీట వేస్తోంది. ముందుగాకంపెనీకి చెందిన రిటైల్ నెట్‌వర్క్, ఎక్స్‌పీరియెన్స్ సెంటర్లు, మల్టీబ్రాండ్ ఔట్‌లెట్లు, ప్రత్యేక స్టోర్లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫాంలతోపాటు..
www.centuaryindia.com, ప్రముఖ ఈ-కామర్స్ సైట్లలోఅందుబాటులో ఉంటాయి.