Wednesday, February 11, 2026
Homeహైదరాబాద్‌Cyclothon | సెంట్రల్ జోన్ పోలీసుల 'సైక్లథాన్'

Cyclothon | సెంట్రల్ జోన్ పోలీసుల ‘సైక్లథాన్’

హైదరాబాద్ సిటీ పోలీస్, సెంట్రల్ జోన్, HCL, హైదరాబాద్ సైక్లిస్ట్స్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సైక్లథాన్’ను ఘనంగా, విజయవంతంగా నిర్వహించారు. ఈ సైక్లథాన్ పీపుల్స్ ప్లాజా నుండి టోలీచౌకిలోని సెవెన్ టోంబ్స్ వరకు సాగింది. ఇందులో 380 మంది సైక్లిస్టులు, 100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. డీజీ బి.శివధర్ రెడ్డి IPS, సీపీ హైదరాబాద్ వి.సి. సజ్జనార్ IPS ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ జోన్ డిసిపి కె. శిల్పవల్లి, ఐపిఎస్ తో పాటు గాంధీనగర్ ఏసిపి యాదగిరి, వెంకట్ రెడ్డి, HCL ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిసిపి కె. శిల్పవల్లి మాట్లాడుతూ, విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల జ్ఞాపకార్థం పోలీసు శాఖతో కలిసి ఈ సైక్లథాన్ నిర్వహించిన HCL యాజమాన్యానికి మరియు హైదరాబాద్ సైక్లిస్ట్స్ కు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

ఇటువంటి కార్యక్రమాల వలన పోలీసుల పట్ల ప్రజల్లో సదభిప్రాయం కలుగుతుందని, పోలీసు-ప్రజా సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్ సంస్థలు సామాజిక కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అలాగే, రేపు (27.10.2025) హైదరాబాద్ సిటీలోని అన్ని జోన్లలో నిర్వహించబడే “మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు”లో ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

సెంట్రల్ జోన్ పరిధిలోని ప్రజలందరూ పోలీసులతో స్నేహపూర్వకంగా మెలగాలని, శాంతిభద్రతల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలని డిసిపి విజ్ఞప్తి చేశారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే డయల్ 100 కు లేదా స్థానిక పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. “ప్రజా సహకారంతోనే సురక్షితమైన, నేరరహిత సమాజాన్ని నిర్మించగలం,” పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News