Wednesday, February 11, 2026
Homeఖమ్మంCPI | శత వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి

CPI | శత వార్షికోత్సవాన్ని జయప్రదం చేయండి

మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సీపీఐ కౌన్సిల్ సభ్యుడు కాసర్ల నాగరాజు పిలుపు

మల్కాజిగిరి, నవంబర్ 17 (ఆదాబ్ హైదరాబాద్): డిసెంబర్ 26న ఖమ్మం(Khammam)లో జరిగే సీపీఐ (Cpi) శత వార్షికోత్సవ (100 Years Celebration) బహిరంగ సభను జయప్రదం చేయాలని ఆ పార్టీ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా సమితి సభ్యుడు కాసర్ల నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. మన దేశ పార్లమెంట్ చరిత్ర(Parliament History)లో 100 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన ఏకైక పార్టీ (One And Only Party) సీపీఐ అని చెప్పారు.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ (Capitalist) విధానానికి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని తెలిపారు. మన దేశంలో రానున్న కాలంలో మతోన్మాద పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లుతుందని పేర్కొన్నారు. దేశానికి సంపూర్ణ స్వతంత్రం కావాలని పోరాడిన పార్టీ సీపీఐ అని వెల్లడించారు. డిసెంబర్ 26న ఖమ్మం వేదికగా జరిగే సీపీఐ శత వసంతోత్సవ ముగింపు సభ చారిత్రాత్మక ఘట్టంగా నిలిచిపోతుందని నాగరాజు అన్నారు. 40 దేశాల నుంచి వామపక్ష ప్రతినిధులు, 5 లక్షల మంది ప్రజలు బహిరంగ సభకు హాజరవుతారని చెప్పారు.

ఆదిలాబాద్ జిల్లా జోడే ఘాట్గాట్ కొమురం భీం నుంచి ప్రచార బస్సు జాత ప్రారంభమైందని తెలిపారు. బాసర నుంచి ఖమ్మం వరకు అన్ని జిల్లాల్లో బస్సు జాతర జరుగుతుందని, ఇది ఈ నెల 19న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కూకట్‌పల్లికి సాయంత్రం 4 గంటలకు వస్తుందని, పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కాసర్ల నాగరాజు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News