Wednesday, February 4, 2026
HomeతెలంగాణFood Safety | జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి.

Food Safety | జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలి.

  • ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. తెలంగాణ డైరెక్టర్ డా. సి.శివలీలను కలిసి విజ్ఞప్తి చేసిన సి.సి.ఐ. ప్రతినిధులు..

కన్స్యూమర్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు బుధవారం రోజు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్డా. సి. శివలీలని మర్యాదపూర్వకంగా కలిశారు.. ఈ సందర్భంగా వారు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ – 2011లోని సబ్ రెగ్యులేషన్ 2.1.15 ప్రకారం జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీలు ఏర్పాటు చేయాలని కోరుతూ వినతి పత్రం సమర్పించారు..

కాగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాలన్నింటిలో జిల్లా స్థాయి ఆహార భద్రత కమిటీలను ఏర్పాటు చేయాలని, ఆ కమిటీలలో ఆహార భద్రత, వినియోగదారుల హక్కులపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న సీసీఐ సభ్యులను కమిటీ సభ్యులుగా నియమించాలని కూడా కోరడం జరిగింది.

- Advertisement -

ప్రత్యేకంగా చికెన్ ఫ్రై, ఇతర మాంసాహార పదార్థాలలో వినియోగిస్తున్న హానికర కృత్రిమ రంగులు, చైనీస్ ఫాస్ట్ ఫుడ్‌లలో అధికంగా ఉపయోగిస్తున్న టేస్టింగ్ సాల్ట్ (అజినోమోటో), నాణ్యత లేని నూనెలు, ఆహార కల్తీ వల్ల ప్రజల ఆరోగ్యంపై పడుతున్న దుష్ప్రభావాలను
ఎఫ్.ఎస్.ఎస్.ఐ. డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.

సీసీఐ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఆహార భద్రతపై అవగాహన కల్పిస్తూ, వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నందున, ప్రభుత్వ యంత్రాంగంతో సమన్వయంతో పని చేయడానికి అవకాశం కల్పించాలని ఈ వినతి పత్రంలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ, సీసీఐ చైర్మన్ మామిడి భీమ్ రెడ్డి, జాతీయ కార్యదర్శి సాంబరాజు చక్రపాణి, జాతీయ కార్యదర్శి పల్లెపాడు దామోదర్, వర్కింగ్ ప్రెసిడెంట్ శిల్పారెడ్డి, జనరల్ సెక్రటరీ సుప్రభా హత్వార్, సెక్రటరీ అందె శ్రీధర్ రెడ్డి, సభ్యులు విప్లవ జ్యోతి,
డా. సి. శివలీల పాల్గొన్నారు.. సీసీఐ చేస్తున్న సేవలను అభినందిస్తూ, వినతి పత్రంలోని అంశాలను పరిశీలించి నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఎఫ్.ఎస్.ఎస్.ఏ.ఐ. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ డా. సి. శివలీల..

- Advertisement -
RELATED ARTICLES

Latest News