కరీంనగర్, నవంబర్ 20(ఆదాబ్ హైదరాబాద్): తెలంగాణ ప్రభుత్వం EBC విద్యార్థులకు రూ.4 వేల స్కాలర్‌షిప్ ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కుల (Caste), ఆదాయ (Income) ధ్రువీకరణ పత్రాలు (Certificates) త్వరగా మంజూరుచేయాలని కరీంనగర్ జిల్లా (Karim Nagar District) మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్నరెడ్డి తహశీల్దార్ల(Tahsildars)ను కోరారు. పేద విద్యార్థులు మీసేవ(Meeseva) ద్వారా దరఖాస్తు (Apply) చేసుకోవడం కష్టమని, ఈ ప్రక్రియను సరళం చేయాలని సూచించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(School principal) అన్ని దరఖాస్తులను పూర్తి చేసి, ధ్రువీకరించి, నేరుగా తహశీల్దార్ కార్యాలయానికి పంపితే విద్యార్థులకు సులభమవుతుందని తెలిపారు. గతంలో కలెక్టర్ ఆదేశాల మేరకు ఇలాగే సర్టిఫికెట్లు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. విద్యార్థులకు సహాయం చేయాలని తహశీల్దార్లకు విజ్ఞప్తి చేశారు.
Certificates | కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి
By Aadab Desk
- Advertisement -
Previous article
Next article
