Wednesday, September 10, 2025
ePaper
spot_img
Homeతెలంగాణ34 జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్ల ఏర్పాటు

34 జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్ల ఏర్పాటు

ఆన్‌లైన్‌లో ప్రారంభించిన మంత్రి దామోదర

34 జిల్లాల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లను ఏర్పాటు చేసుకోవడం సంతోషకరమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీ నుంచి అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ వైద్య ఆసుపత్రుల్లో క్యాన్సర్‌ డే కేర్‌ సెంటర్లను మంత్రి దామోదర రాజనర్సింహ ఆన్‌లైన్‌లో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 20 బెడ్స్‌ కెపాసిటీతో 34 సెంటర్స్‌ ఏర్పాటు చేసుకున్నామన్నారు. క్యాన్సర్‌ నివారణకు నోరి దత్తాత్రేయుడి సేవలు మరువలేనివని.. దత్తాత్రేయుడిని ఆరోగ్య శాఖ సలహాదారుగా నియమించుకున్నట్టు చెప్పారు. రేడియేషన్‌ సెంటర్స్‌, మొబైల్‌ కాన్సర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నది ప్రభుత్వ సంకల్పమని మంత్రి దామోదర రాజనర్సింహ స్పష్టం చేశారు. ప్రతీ గ్రామంలో మొబైల్‌ కాన్సర్‌ సెంటర్స్‌ పని చేస్తాయని పేర్కొన్నారు. జర్మనీ, జపాన్‌ వెళ్లే స్థాయిలో నర్సులు ఆలోచన చేయాలని సూచించారు. రాబోయే కాలంలో 70 శాతం క్యాన్సర్‌ పెరగొచ్చు. ముందస్తు స్కీన్రింగ్‌ తప్పనిసరిగా చేయించుకోవాలి. నర్సింగ్‌ విద్యార్థులకు ఫారెన్‌ లాంగ్వేజెస్‌ లో ట్రైనింగ్‌ ఇప్పిస్తాం. జపాన్‌, జర్మనీ భాషల్లో ప్రావీణ్యం కలిగి ఉండాలని.. మన దగ్గర ఏడాదికి 3 వేల మందిని నర్సు లను తీర్చిదిద్దుతున్నామని వెల్లడిరచారు.

RELATED ARTICLES
- Advertisment -

Latest News